1)జయ సాయినాథ పరాత్పర రూపా
జయ షిరిడీశ చిన్మయ రూపా
2)తల్లిదండ్రులు ఎవరో తెలియదు
కులమత వివరములసలే తెలియవు
3)దర్శనమిచ్చె ను బాల ఫకీరుగా
భావనకందని భగవంతునిగా
4)మహాల్సాపతి మది పిలచిన దైవము
షిరిడీ పురమున వెలసిన దైవం
5)గుఱ్ఱము జాడ తెలిపినందుకు
నీరూ నిప్పు చూపిన తీరుకు
6)చాంద్ పాటి ల్ అచ్చెరువొందెను
భక్తు నిగా శరణాగతి వేడెను
7)రవితేజస్సును కలిగిన యోగీ
రాగ ద్వేషములు లేని విరాగీ
8)చంద్రుని బోలిన చక్కని సాయి
చల్లని దీవెన ఇచ్చును హాయి
9)యోగిరూపధర హే మహిమాన్విత
పావన చరిత ఋషి జన సేవిత
10)భక్త జనావన హృదయ విహారీ
భవభయహారీ కఫ్నీ ధారీ
11)భగవద్గీతకు భాష్యము చప్పెను
ఖురాను పదముల అర్ధము చెప్పెను
12)నరనరాలను శుధ్ధి పరచెను
ఖండ యోగమున ఘనుడని చాటెను
13) గురు కటాక్షమును పొందిన ఘనుడు
సద్గురువై దయ చూపే ఘనుడు
14) అన్నదాతా హే అభయ ప్రదాతా
ఆశ్రితులకు ఆనంద ప్రదాతా
15) ఆశాపాశము లేని పవిత్రుడు
అగణిత గుణగణ దివ్య చరిత్రుడు
18) భక్త రక్షణ దీక్షావ్రతుడు
భుక్తి ముక్తి ఇచ్చే దేవుడు
19) మృతుడై మళ్ళీ జీవముపొందెను
మాధవ మహిమను మహిలొ చూపెను
20) నీళ్ళతోవెలిగె దీప కాంతులు
నివ్వెర పోయిరి షిర్డీ ప్రజలు
21) పంచభూతముల అధి దేవతవు
భూత భేతాళ నిరోధకుడవు
22) బిక్షమడిగెను తన భక్తులను
కర్మ ఫలితములను తనకిమ్మనెను
23) కుష్టు రోగమే కనుమరుగాయెను
భాగోజీ నీ దాసుడాయెను
24) బాయిజా మాతకు మోక్ష దాతవు
తాత్యా కేమో ప్రాణ దాతవు
25) శ్యామా నమ్మిన హితుడవు నీవే
రాధామాయికి స్వామివి నీవే
26) చందోర్కరుడే నీ దరి చేరెను
దాసగణుడు నీ ఘనతను చాటెను
27) గౌలిబువాకు విఠల దేవుడవు
ఖోజోకరునకు దత్త దేవుడవు
28) బాంద్రవనితకు నీవే గణపతి
నిమోన్కరునకు నీవే మారుతి
29) రాముడే నీవని డాక్టరు చెప్పెను
సత్య దేవుడని గణుడు పలికెను
30) మేఘా నమ్మిన శివుడవు నీవే
ఫాల్కే నమ్మిన అల్లా నేవే
31) సకల దేవతా రూపము నీవే
సకల చరా చర జగత్తు నీవే
32) యోగ శక్తి తో వెలిగించిన ధుని
పాపాలను కాల్చేసే పావని
33) మైనాతాయిని రక్షించినది
ఇహపరాలకు ఔష ధమైనది
34) భక్తుల కిచ్చెను బాబా ఊది
ధుని అందించిన దివ్య విభూది
35) గోధుమ పిండితో కలరా ఆగెను
అన్నాసాహెబు అచ్చెరువొందెను
36) బాబా లీలలు కధగా వ్రాసెను
హేమాద్రిపంత్ అని బిరుదు పొందెను
37) మసీదు మారెను ద్వారకా మాయిగా
మహిలోవెలిగెను పుణ్య తీర్ధముగా
38) సమాధి కోవెల బూటీ కట్టెను
ఆశ్రితులకు అది అభయము నిచ్చును
39)అందమైన సమ్మోహన మూర్తీ
సచ్చిదానంద చిన్మయ మూర్తీ
40) జైజై జై ..అను దివ్య కీర్తనలు llజైll
భక్తులు పాడే నాల్గు హారతులు
41) ఈ చాలీసా సాయీశునిది
సుఖ సంపదలను అందిచేది
42) రాజేంద్రుని మదిలో పలికించెను
తన లీలగా భక్తులకు అందించెను llజయ ll
43)మానవ రూపము దాల్చిన ఈశా
మంగళ కరుడగు షిర్డీశా
44) సదా.. హృదయ మందిరమున నిలిచే
సామరూపధర సాయిశా
|| శ్రీ సాయి రామ || |