|| శ్రీ సాయి రామ || |
రాగం : కానడ
తాళం : ఆది
ప|| శ్రీ సాయి నక్షత్రమాలికను ..... సదా
చదివేడివారికి సకల శుభములు
సందేహమేలేదు సందేహమేలేదు || శ్రీ ||
చ. ౧. సాయేస్వయముగ ఆశిర్వదించిన
సచ్చరితము ఈ నక్షత్రమాలిక
కోరినవారి కోర్కెలు తిర్చేది
కల్పతరువు ఈ నక్షత్రమాలిక || శ్రీ ||
౨. దిర్ఘవ్యాధులను పారద్రోలేడి
దివ్యొషధమీ నక్షత్రమాలిక
పాపారణ్యమును, భస్మము చేసెడి
దావానల మీ నక్షత్రమాలిక || శ్రీ ||
౩. సతతము దీనిని శ్రద్ధగ చదువండి
భావము గ్రహియించి భక్తితో పాడండి
చక్కని సాయికి హారతులివ్వండి
సకల సంపదలు సమకూరునండి || శ్రీ ||
|| శ్రీ సాయి ప్రణామా ||
No comments:
Post a Comment